Tuesday, December 24, 2024
HomeMovie NewsRAPO22 ఓపెనింగ్ ముహూర్తం ఫిక్స్

RAPO22 ఓపెనింగ్ ముహూర్తం ఫిక్స్

- Advertisement -

రామ్ పోతినేని ప్రస్తుతం గడ్డుకాలం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కు ముందు డిజాస్టర్లే..ఇస్మార్ట్ శంకర్ తర్వాత డిజాస్టర్లే పలకరించాయి. డబుల్ ఇస్మార్ట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడం తో నెక్స్ట్ చేయబోయే RAPO22 భారీ ఆశలు పెట్టుకున్నాడు.

రామ్ హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ డైరెక్ట‌ర్ పి.మహేష్ బాబు దర్శకత్వంలో #RAPO22 అనే వర్కింగ్ టైటిల్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కాగా, ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ డేట్‌ని ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమాను ఈ గురువారం (నవంబర్ 21న) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్టు నిర్మాణ సంస్థ ఈ రోజు అనౌన్స్ చేసింది. సినిమా ప్రారంభోత్సవం రోజు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కొంతకాలంగా యాక్షన్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్‌ ఈ సారి మాత్రం ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే కథతో రాబోతున్నాడని అర్థమవుతోంది. ఇంతకీ రామ్‌ కోసం మహేశ్ బాబు ఎలాంటి కథ రెడీ చేశాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Beginning the beautiful journey of filming Untold Emotions ❤‍🔥#RAPO22 pooja ceremony on 21st November ✨

Stay tuned for exciting updates 💥

Starring @ramsayz
Written and directed by @filmymahesh
Produced by @MythriOfficial pic.twitter.com/3D8e8RsrDW— Mythri Movie Makers (@MythriOfficial) November 19, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read