Monday, December 23, 2024
HomeMovie Newsదీపికకు పుట్టబోయేది అబ్బాయా..?..అమ్మాయా..?

దీపికకు పుట్టబోయేది అబ్బాయా..?..అమ్మాయా..?

- Advertisement -

కల్కి మూవీ లో గర్భవతి గా కనిపించిన దీపికా..నిజ జీవితంలో కూడా ఇప్పుడు కడుపు తో ఉంది. దీంతో అభిమానులు , నెటిజన్లంతా దీపికకు పుట్టబోయేది అబ్బాయా..? అమ్మాయా..? అని ప్రశ్నించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రణ్​వీర్ తనకు పాప కావాలా? బాబు కావాలా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. దీపికా పదుకొణె, రణ్​వీర్ సింగ్​ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29న దీపిక తన ప్రెగ్నెన్సీ వార్తను తెలిపి అభిమానులను సంతోష పెట్టింది. అప్పటి నుండి దీపికా కు ఎవరు పుడుతారో అనే చర్చ మొదలైంది.

తాజాగా బాబు కావాలా, పాప కావాలా అన్న ప్రశ్నకు రణబీర్ సమాధానం ఇచ్చారు. అది తన చేతుల్లో లేదని అన్నారు. అలానే ఓ సినిమా డైలాగ్​ను కూడా చెప్పాడు. మనం గుడికి వెళితే ఇచ్చిన ప్రసాదం తీసుకుంటాం గానీ లడ్డూ కావాలి, షీరా కావాలి అని అడగం, అలాగే భగవంతుడు ఏది ఇస్తే అది స్వీత్క్రితం అన్నారు. దీపిక చిన్నప్పటి ఫోటోలు ఓ సారి చూశానని, అందులో దీపిక చాలా బాగా ఉందని చెప్పిన రణ్​వీర్​ అప్పుడే తనకు అలాంటి అందమైన పాప కావాలని కోరుకున్నట్లు తెలిపారు. దీపికా, తాను పిల్లల కోసం కొన్ని పేర్లు సిద్ధం చేసుకున్నామని కానీ వాటిని ఇప్పుడే బయట పెట్టనని వెల్లడించారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read