Movie News

ఉత్తమ నటుడిగా రానా

టాలీవుడ్ నటుడు రానా ద‌గ్గుబాటి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును దక్కించుకున్నాడు. ఆయ‌న న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ వెబ్ సిరీస్ రానా నాయుడు గాను ఈ అవార్డును అందుకున్నాడు. ఇండియ‌న్ బుల్లితెర‌ న‌టులు ప్రతిష్టాత్మకమైనదిగా భావించే ఇండియన్‌ టెలీ అవార్డ్స్ 2024 అవార్డ్స్ వేడుక శుక్రవారం అట్టహాసంగా జ‌రిగింది.

రానా, వెంకటేశ్‌ కీలక పాత్రలు పోషించిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌ ఓటీటీలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే! ఇప్పటికే ఈ సిరీస్‌ పలు అవార్డులు అందుకుంది. తాజాగా ఇందులో నటనకు గాను ఉత్తమ నటుడిగా రానా అవార్డును పొందారు. ‘ఇండియన్‌ టెలీ అవార్డు 2024’లో ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. రానా తరఫున ఈ అవార్డును సిరీస్‌ డైరెక్టర్‌ అందుకున్నారు. దీనిపై నటుడు స్పందిస్తూ.. ఈ పురస్కారానికి ఎంపిక కావడం గౌరవంగా ఉంది’’ అని ట్వీట్‌ చేశారు. దీంతో నెటిజన్లు రానాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.