స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి “రామం రాఘవం” నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ చిత్ర దర్శకుడు, నటుడు ధనరాజ్ మాట్లాడుతూ తనలోని భావోద్వేగాన్ని బయటపెట్టారు. అరిపాక ప్రభాకర్ గారు లేకపోతే ఈ చిత్రం లేదు. ఈ చిత్ర కథ ప్రేక్షకులని ఏడిపించేలా ఉంటుంది అని అందరూ అంటున్నారు. కావాలని ఏడిపించడానికి ఈ చిత్రం చేయలేదు. కాకపోతే ప్రతి సన్నివేశం ప్రతి కుటుంబంలో ఏదో ఒక సందర్భంలో జరిగే ఉంటుంది. సముద్రఖని లాంటి గొప్ప నటుడు కమెడియన్ ధనరాజ్ కి ఫాదర్ గా నటించడం ఏంటి అని చాలా మంది కామెంట్స్ చేశారు. సముద్రఖని గారికి నాకు ఫాదర్ గా నటించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.
నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. ఈ చిత్ర కథని నేను 3, 4 గంటలు విని ఒకే చెప్పేయలేదు. ఈ కథ జెన్యూన్ అని నమ్మిన తర్వాత ఒప్పుకున్నా. జెండాపై కపిరాజు షూటింగ్ లో తాను తొలిసారి ధనరాజ్ ని చూసినట్లు సముద్రఖని తెలిపారు. ధనరాజ్ ఈ చిత్ర కథని రెండు లైన్స్ లో చెప్పినప్పుడే బలమైన కథ అనిపించింది అని సముద్రఖని అన్నారు.

ఈ చిత్ర నిర్మాత పృథ్వీ పోలవరపు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం ప్రారంభం కావడానికి కారణం ఆరిపాక ప్రభాకర్ గారు. ఈ చిత్రం కథ విన్న రోజు నుంచి ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీవ్వ్యూ చూసే వరకు నాకు ఈ మూవీ ఒక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ. రామం రాఘవం చిత్రం రిలీజ్ తర్వాత ధనరాజ్ పోస్టర్ పై బిజినెస్ జరిగే రోజు వస్తుంది. ధనరాజ్ ఫోటో పోస్టర్ పై కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ స్థాయికి ఆయన చేరుకుంటారు’ అని అన్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా వచ్చిన సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘నేను మాట్లాడాలనుకున్న విషయాలు అందరూ చెప్పేశారు. కానీ ధనరాజ్ అన్న గురించి నేను మాట్లాడాలి. ఆయన నా సీనియర్ గా జర్నీ ప్రారంభం అయింది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసే వ్యక్తిత్వం ఆయనది. ట్యాలెంట్ ఉన్న వారికీ ఏదో విధంగా ఛాన్స్ రావాలి అని సహాయం చేస్తారు. సముద్రఖని లాంటి గొప్ప నటుడు, దర్శకుడు ఈ చిత్రానికి ఒప్పుకున్నారు అంటేనే రామం రాఘవం ఎంత మంచి చిత్రమో అర్థం అర్థమైపోతుంది’ అని అన్నారు.