స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో, పృథ్వి పొలవరపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి “రామం రాఘవం” అనే పేరు పెట్టారు. ఈ చిత్రానికి నటుడు ధనరాజ్ తొలి సారిగా దర్శకత్వం వహించగా, ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ప్రేమికుల రోజు సందర్బంగా, ఫిబ్రవరి 14, 2025 న ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషలలో ఒకేసారి థియేటర్స్ లో విడుదల కాబోతుందంటూ, న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ మరియు “తెలిసిందా నేడు” సాంగ్ కు మంచి స్పందన లభించింది. త్వరలోనే చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాని ప్రత్యేకంగా తయారుచేసిన ఎమోషనల్ పాయింట్ వలన, తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక విభిన్న భావోద్వేగాంశంతో “రామం రాఘవం” సినిమా రూపొందింది. ప్రముఖ దర్శకుడు శివప్రసాద్ యానాల, “విమానం” చిత్రానికి కథ అందించినట్లుగా, ఈ చిత్రానికి కూడా కథ అందించారు.
ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృథ్వి, శ్రీనివాసరెడ్డి, చిత్ర శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు, మార్థాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. ఈ చిత్రంలోని పాటలను ప్రముఖ lyricist రామజోగయ్య శాస్త్రి రాశారు.
“రామం రాఘవం” సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది.