Movie News

పిఠాపురంకు మెగా పవర్ స్టార్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కాసపేటలో పిఠాపురంకు చేరుకోబోతున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో అందరి ఫోకస్ ఈ నియోజకవర్గంపైనే ఉంది. పిఠాపురాన్ని టార్గెట్ చేసిన సీఎం జగన్ చివరి ప్రచారం ఇక్కడే నిర్వహించనున్నారు.

ఇక ఇప్పుడు బాబాయ్కి మద్దతుగా పిఠాపురానికి రామ్ చరణ్. తల్లి సురేఖతో కలిసి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పిఠాపురానికి వెళ్లనున్నారు. అక్కడ స్థానిక కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్న పవన్ కల్యాణ్ కు సపోర్టింగ్ గా.. అనేక మంది సెలబ్రిటీలు రోజుకొకరు ప్రచారం చేస్తున్నారు. మరికొందరేమో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా రావడంతో పిఠాపురం కు మరింత క్రేజ్ పెరిగింది. మరి చరణ్..బాబాయ్ ని కలుస్తారా..? లేదా అనేది చూడాలి.