చిరుత తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. తన స్టోరీ సెలక్షన్, యాక్టింగ్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తూ తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకుంటూ మెగా వారసుడు అనిపించుకున్నాడు. ఇక ‘RRR’ తర్వాత చరణ్ లైఫే మారిపోయింది. ఈ ఒక్క సినిమాతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం అటు ప్రొఫెషనల్ లైఫ్‌లో, ఇటు పర్సనల్ లైఫ్‌లో రెండిటిలోనూ హ్యాపీగా గడిపేస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, తను సక్సెస్, ఫెయిల్యూర్‌ను చూసే దృష్టికోణం గురించి పలు విషయాలు ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.
‘‘నాకు అసలు ప్రెజర్‌ను హ్యాండిల్ చేయడం రాదు. అది నాలో పాజిటివ్ అనుకోవాలా, నెగిటివ్ అనుకోవాలా నాకే అర్థం కాదు. ‘RRR’ సక్సెస్ అయినప్పుడు నాకు బాగా గుర్తుంది. నేను ఒక వారం రోజులు అసలు ఇంటి నుంచి బయటికి రాలేదు. నేను అన్నింటికి దూరంగా రిలాక్స్ అవుతూ ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్ చేశాను’’ అని తెలిపాడు రామ్ చరణ్. సినిమాలు ఫెయిల్ అయినప్పుడు తన రియాక్షన్ ఏంటని అడగగా.. రామ్ చరణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘‘నా సినిమాలు ఫెయిల్ అయినప్పుడు నేను పార్టీ చేసుకున్నాను. అలా చేస్తేనే నేను బ్యాలెన్స్‌గా ఉంటానని నేను నమ్ముతాను. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా జర్నీని ఎంజాయ్ చేయడమే నాకు చాలా ఇష్టం’’ అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’పై ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా నుంచి ఒక పాటను కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. అంతకు మించి ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ‘గేమ్ ఛేంజర్’ సెట్స్‌పై ఉండగానే సుకుమార్‌తో ఒక మూవీని అనౌన్స్ చేశాడు చరణ్. అంతే కాకుండా సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబుతో కూడా ఒక సినిమా ప్లాన్ చేసి దాని ఓపెనింగ్‌ను ఓ రేంజ్‌లో చేశారు.