Tuesday, December 24, 2024
HomeMovie Newsఆసక్తికరంగా ‘రాజు వెడ్స్‌ రాంబాయ్‌’ టీజర్

ఆసక్తికరంగా ‘రాజు వెడ్స్‌ రాంబాయ్‌’ టీజర్

- Advertisement -

‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ సినిమాల దర్శకుడిగా ప్రాచుర్యం పొందిన వేణు ఉడుగుల.. కొంత విరామం తర్వాత నిర్మాతగా మారి ‘రాజు వెడ్స్ రాంబాయ్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శైలు కంపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వేణు ఉడుగుల మరియు ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రాజు, రాంబాయి మధ్య ప్రేమకథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా టీజర్ మంగళవారం విడుదలైంది. “నా పేరు యనగంటి రాంబాయి.. మా నాన్న పేరు యనగంటి వెంకన్న” అంటూ ప్రారంభమైన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రాంబాయి తన గ్రామంలో రాజు అనే అబ్బాయిని ప్రేమించడం, ఆయనలో పెద్దగా అర్హతలేమైనా, అతని బ్యాండ్ వాయించడాన్ని చూసి ఆకర్షితురాలవడం వంటి హాస్యరస భరితమైన ప్రేమకథ ఈ టీజర్‌లో ఉట్టిపడుతోంది.

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లోని ఒక గ్రామంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం, ప్రేమను కొత్త కోణంలో చూపించనుంది. ఈ ప్రేమకథాత్మక చిత్రం 2025 ఫిబ్రవరి 14న, ప్రేమికుల దినోత్సవ సందర్భంగా విడుదల కానుంది.

“రాజు వెడ్స్ రాంబాయి” –
వీళ్ళ ప్రేమ ఒక తీన్మార్…
ఒక దోమార్….
ఒక నాగిని…..!

…త్వరలో మీ అభిమాన థియేటర్స్ లో@dsfofficial_ @Moonsoontal2444 @venuudugulafilm @rahulmopidev @sureshbobbili9@nareshadupa @GNadikudikar @saailukampati pic.twitter.com/npiHuoglhr— v e n u u d u g u l a (@venuudugulafilm) November 19, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read