Movie News

రజనీ – మోహన్ బాబు ల స్నేహం చూడండి..ఎంత బాగుందో..!!

సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు మధ్య స్నేహం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. తాజాగా మోహన్ బాబు సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోకి మోహన్ బాబు ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. అప్పుడు… ఇప్పుడు… ఎప్పుడైనా స్నేహమేరా జీవితం అనే క్యాప్షన్ ని మోహన్ బాబు ఆ ఫోటోకి పెట్టారు. ఫోటోలో మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్ పక్కపక్కనే ఫ్లైట్ లో కూర్చొని ఉన్నారు. మోహన్ బాబు భుజం మీద చేయి వేసి సూపర్ స్టార్ రజినీకాంత్ సరదాగా మాట్లాడుతూ కెమెరాకి ఫోజులిచ్చారు. రీసెంట్ గానే వీరిద్దరూ ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లో విలన్ గా, హీరోగా తనదైన విలక్షణ నటనతో మెప్పించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మోహన్ బాబు.. వయస్సు పెరిగిన ఇప్పటికి నటుడిగా తాను మాత్రమే చేయగలిగే పాత్రలని ఎంపిక చేసుకొని రాణిస్తున్నాడు. కాకపోతే గతంలో మాదిరి స్పీడ్ గా మూవీస్ చేయకున్న అడపాదడపా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మోహన్ బాబు మెప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మంచు విష్ణు లీడ్ రోల్ చేస్తోన్న కన్నప్ప సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.