హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ విలేకరుల సమావేశంలో రాబిన్‌హుడ్ విశేషాలు పంచుకున్నారు.
రాబిన్‌హుడ్ జర్నీ ఎలా అనిపించింది ?
-సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్ళు అయ్యింది. రాబిన్‌హుడ్ చేశాక యాక్టర్ గా నామీద నాకు కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగింది. రాబిన్‌హుడ్ చూసాక నేను హీరోగా చేసిన ఎంటర్ టైనింగ్ సినిమాలు, ఆనాటి రోజులు ఆడియన్స్ కి గుర్తుకు వస్తాయి.
రాబిన్‌హుడ్ లో మీకు, నితిన్ గారికి మధ్య కెమిస్ట్రీ ఎలా వుంటుంది ?
-ఇందులో ఇండియాలోనే హయ్యస్ట్ సెక్యురిటీ ఏజెన్సీ నాది. నా ఏజెన్సీలో పని చేయడానికి హీరో వస్తాడు. ఇంతకంటే కథ చెప్పకూడదు(నవ్వుతూ) ఈ కాంబినేషన్ లో చాలా అద్భుతంగా వుంటుంది.

డైరెక్టర్ వెంకీ కుడుముల గురించి?
-వెంకీ కుడుముల చాలా బిగ్ డైరెక్టర్ అవుతారు. ఈ మధ్య కాలంలో వన్ అఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ రాబిన్‌హుడ్ లో చేశాను. డైరెక్టర్ వెంకీ స్పెషల్ గా ఈ క్యారెక్టర్ ని నా గురించి రాసుకున్నారు. వర్క్ చేస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. వెంకీ, త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు.
రాబిన్‌హుడ్ లో శ్రీలీల క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
-శ్రీలీల చాలా మంచి సినిమాలు చేస్తోంది. చాలా మెచ్యూర్ యాక్టర్ గా కనిపించింది. ఇందులో ఆమె బిహేవియర్ నాకు చాలా నచ్చింది. ఇందులో ఫారిన్ నుంచి వచ్చిన తనకి సెక్యురిటీ ఇచ్చే బాధ్యత మాది. చాలా సరదాగా వుంటుంది.
మైత్రి మూవీ మేకర్స్ గురించి ?
-శ్రీమంతుడు సినిమా నుంచి వారితో నాకు మంచి అనుబంధం వుంది. సినిమా అంటే చాలా పాషన్ వున్న నిర్మాతలు. వారితో కలసి పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.
కొత్త దర్శకులకు మీతో వర్క్ చేయడం ఎలా వుంటుంది ?
-నాకు కొత్త పాత అని వుండవు, నిజానికి కొత్త దర్శకులు నాతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అందరికంటే ముందు నేనే సెట్స్ లో తెగ అల్లరి చేస్తాను. దీంతో అందరూ చాలా కంఫర్ట్ బుల్ గా ఫీలౌతారు. నాతో వర్క్ చేయడం చాలా ఈజీ.
కొత్తగా చేస్తున్న సినిమాలు ?
-చాలా సినిమాలు చేస్తున్నాను. దాదాపు ఏడు సినిమాలు రన్నింగ్ లో వున్నాయి. మొదలు పెట్టాల్సిన సినిమాలు ఓ ఐదు వరకు వుంటాయి.