Monday, December 23, 2024
HomeMovie News'రాజాసాబ్' నుండి ప్రభాస్ మరో లుక్ రిలీజ్

‘రాజాసాబ్’ నుండి ప్రభాస్ మరో లుక్ రిలీజ్

- Advertisement -

ప్రభాస్ నటించిన . ‘కల్కి 2898 ఏడీ’ మూవీ భారీ విజయం సాధించడం తో ప్రభాస్ నుండి వస్తున్న నెక్స్ట్ మూవీ రాజాసాబ్’ పై అందర్నీ రెట్టింపు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ మారుతీ జాగ్రత్త పడుతున్నాడు. ప్ర‌భాస్ ని జోవియ‌ల్ గా చూసి కూడా చాలా కాల‌మైంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభాస్ చేస్తున్న తొలి హార‌ర్ సినిమా ఇది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఎదురు చూడ‌డానికి ఇలా స‌వాల‌క్ష కార‌ణాలు, కోణాలూ ఉన్నాయి. ఈ సినిమాని మ‌రింత స్పెష‌ల్ గా మార్చ‌డానికి మారుతి త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు.

అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్​ డే సందర్భంగా మేకర్స్​ రెండు రోజుల ముందే ఫ్యాన్స్​కు ట్రీట్ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం సినిమా నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ స్టైలిష్ లుక్​తో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక అక్టోబర్ 23న అసలైన ట్రీట్ ఉందంటూ పోస్ట్ షేర్ చేశారు. అంటే ప్రభాస్ బర్త్​ డే రోజు వీడియో గ్లింప్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ లుక్ లో టీ షర్ట్​, షర్ట్​, బ్లాక్ జీన్స్​తో ప్రభాస్ నిలబడి ఉన్న పోస్టర్ ఫ్యాన్స్​ను తెగ ఆకట్టుకుంటుంది. ఇంక కూలింగ్ గ్లాసెస్ ధరించడం వల్ల మరింత స్టైలిష్ లుక్ వచ్చింది. ఈ పోస్టర్​ను డైరెక్టర్ మారుతి చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాశారు. ‘ఈ ప్రయాణంలో మేం, తయారు చేసిన డార్లింగ్ క్యారెక్టర్ ఇది’ అని మారుతి పోస్ట్​ చేశారు. నిమిషాల్లోనే ప్రభాస్ లుక్ ట్రెండింగ్​లోకి వచ్చేసింది. ఇక నుంచి సినిమా రిలీజ్ దాకా వరుసగా అప్డేట్స్ ఉంటాయని నిర్మాత ఎస్​కేఎన్​ తెలిపారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read