Movie News

ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్

ప్రభాస్ నటించిన కల్కి మూవీ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాజిటివ్ బజ్ తో రాబోతున్న ఏ మూవీ కోసం యావత్ అభిమానులు , సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగానే ఫ్యాన్స్ కు మరో కిక్ ఇచ్చే న్యూస్ తెలిపారు రాజా సాబ్ మేకర్స్.

రాజా సాబ్ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాబట్టి సాంగ్స్ పై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఇకపోతే రాజా సాబ్ సినిమా నుండి మ్యూజిక్ విషయమై ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కి మ్యూజిక్ థమన్ ఇస్తున్నాడన్న సంగతి తెలిసిందే. తాజాగా థమన్ రాజాసాబ్ కోసం మ్యూజిక్ సిట్టింగ్ వేసాడని డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలో దాదాపు ఆరు పాటలుంటాయట. హీరోయిన్లతోనే నాలుగు సాంగ్స్ ఎంటర్టైనింగ్ గా మాస్ బీట్స్ తో ఉంటాయని సమాచారం. ఇక ప్రభాస్ చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమాలో మాస్ స్టెప్స్ వేయబోతున్నాడట. డార్లింగ్ ప్రభాస్ విషయంలో ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా మిస్ అయింది డాన్స్ నే. రాజాసాబ్ తో ఆ లోటు థమన్ తీర్చేస్తాడని సమాచారం. ఇప్పటికే మూడు సాంగ్స్ రెడీ చేయగా, ట్యూన్స్ లో కొత్తరకం ట్రై చేస్తూ మారుతీ థమన్ సెట్టింగ్ వేశారు. ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ లకి రిలాక్స్ కోసం కాస్త బ్రేక్ ఇచ్చాడు. కల్కి రిలీజ్ అయిన రెండు వారాలకి సెట్స్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది