Movie News

కల్కి మూవీ ఫై రాజమౌళి కామెంట్స్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ కి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడం తో మేకర్స్ తో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సినిమా చూసిన సినీ ప్రముఖులు సైతం తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు.

“కల్కి 2898 ఏడీ కోసం నిర్మించిన సరికొత్త ప్రపంచం అదిరింది. ఈ సన్నివేశాలు చూస్తుంటే ఎక్కడికో వెళ్లిపోయిన ఫీలింగ్ కలిగింది. డార్లింగ్ అయితే తన టైమింగ్, ఈస్‌తో చంపేశాడు. ఇక అమితాబ్ జీ, కమల్ సార్, దీపిక.. ప్రభాస్‌కి గొప్పగా సపోర్ట్ చేశారు. ఇక చివరి 30 నిమిషాల సినిమా అయితే నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయింది. ఇలాంటి సినిమా తీసేందుకు ఎంతో కృషి చేసిన నాగి సహా మొత్తం వైజయంతీ టీమ్‌కి హ్యాట్సాఫ్.” అంటూ రాజమౌళి పోస్ట్ చేశారు.

Loved the world-building of #Kalki2898AD… It transported me into various realms with its incredible settings.
Darling just killed it with his timing and ease… Great support from Amitabh ji, Kamal sir, and Deepika.
The last 30 minutes of the film took me to a whole new world.…
— rajamouli ss (@ssrajamouli) June 27, 2024