Friday, November 22, 2024
HomeMovie Newsప్రభాస్ కు బద్ధకం ఎక్కువ..పెళ్లి చేసుకోవడానికి కూడా బద్ధకమే - రాజమౌళి

ప్రభాస్ కు బద్ధకం ఎక్కువ..పెళ్లి చేసుకోవడానికి కూడా బద్ధకమే – రాజమౌళి

- Advertisement -

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అంటే చాలా మందికి ప్రభాస్‌ గుర్తొస్తారు. ఫ్యాన్స్‌ ముద్దుగా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, డార్లింగ్‌గా పిలుచుకునే ప్రభాస్‌..పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో అని అంత ఎదురుచూస్తున్నారు. ఏడాదైనా పెళ్లి చేసుకుంటాడో చూడాలి అంటూ అభిమానులు అనుకోవడం ఏడాది గడిచిపోవడం ఇలా జరిగిపోతూనే ఉంది. ఇటీవల కూడా ‘నా జీవితంలోకి ఓ స్పెషల్‌ పర్సన్‌ రాబోతున్నారు.’ అంటూ ట్వీట్‌ చేసి ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి నింపాడు.

తీరా పెళ్లి గురించి కాదని, ‘కల్కి 2898 AD’ ప్రమోషన్స్‌ కోసం పోస్ట్‌ చేశారని తెలిసి ఫ్యాన్స్‌ నిరాశచెందారు. అయితే ప్రభాస్‌ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదనే విషయాన్ని ఓ సారి స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి రివీల్‌ చేశారు. ఆయన ఏం చెప్పారంటే?

“ప్రభాస్ చాలా బద్ధకస్తుడు, పెళ్లి చేసుకోవడానికి కూడా బద్ధకం. ఒక అమ్మాయిని వెతికి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, ఇదంతా ప్రభాస్‌కి టూ మచ్‌ వర్క్‌. అందుకే అతను పెళ్లి చేసుకోవడం లేదు.” అంటూ సరదాగా బదులిచ్చారు. 2018లో జరిగిన బాహుబలి ప్రమోషన్స్​లో భాగంగా జరిగిన ఓ టాక్​ షోలో​ టాక్ షోలో పాల్గొన్నప్పుడు రాజమౌళి ఈ కామెంట్స్‌ చేశారు.

2019లో సాహో ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్‌ ఇదే చెప్పారు. అక్కడ కూడా రాజమౌళి చెప్పిన అంశాలనే ప్రభాస్‌ రిపీట్‌ చేశారు. “లేజీ, షై, కొత్త వ్యక్తులను కలవలేను. నాకు ఈ మూడు ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ ఫీల్డ్‌కి ఎలా వచ్చానా? అని కూడా అనిపిస్తుంది.” అంటూ ప్రభాస్ రివీల్ చేశారు. మరి ఇలా బద్దకంతో ఎన్ని ఏళ్ళు ఇలా ఒంటరిగా గడుపుతాడో..

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read