టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. లావణ్య అనే ఓ యువతి హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకొని వదిలేసాడంటూ పేర్కొంది. హీరోయిన్ మాళోత్ర కారణంగా రాజ్ తరుణ దూరం పెడుతున్నాడంటూ తెలిపింది. ఆ తర్వాత లావణ్య కరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వకపోవడంతో తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామని పోలీసులు లాభణ్య కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ బయటకొచ్చి ఆమె చెప్పిన ఆరోపణలన్ని అబద్ధాలేనని కొట్టి పారేశారు. అయితే లావణ్య, రాజ్ తరుణ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా లావణ్య రాజ్ తరుణ్ పై విరుచుకుపడుతూ చేసిన బూతు పురాణానికి సంబంధించిన ఆడియో లీక్ అయ్యి సంచలనంగా మారింది.
ఆడియోలో కొన్ని చోట్ల ఆమె దారుణమైన పదాలు వాడుతూ రాజ్ తరుణ్ ను ఓ రేంజ్ లో ఉతికి ఆరేసింది. నేను లేకపోతే నువ్వు ఉండగలవా? అంటూ మొదలైన ఆ ఆడియోలో రాజ్ తరుణ్ ను నిలదీసిన లావణ్య తన ముఖం చూసి అదే విషయాన్ని చెప్పాలని అడిగింది. ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ గురించి కూడా ప్రస్తావిస్తూ దారుణంగా బుతుపురాణం మొదలు పెట్టింది. * నాకు అస్సలు అక్కర్లేదు అని రాజ్ తరుణ్ అనగా, ధూ… ని దగ్గరకు వచ్చే ఆడది ఎవడ్రా అంటూ ఉమ్మేసింది. డబ్బుల కోసమే అయితే వాడి దగ్గర 10 కోట్లు ఉంటే మన దగ్గర డబుల్ ఉంది అంటూ ఆమె చేసిన రచ్చ అంతా ఆ ఆడియోలో రికార్డు అయ్యింది.