రాజ్ తరుణ్ కు సంబంధించి రోజుకో వార్త వైరల్ గా మారుతుంది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాజ్‌తరుణ్‌పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హీరోపై నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో కేసునమోదు అయ్యింది. రాజ్‌తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా తాజాగా లావణ్య మరోబాంబ్ పేల్చింది. తాను నెలతప్పడం కాదని.. రాజ్ తరుణ్ వల్ల అరియానా నెల తప్పిందని అందుకే ఆమె లావు అయ్యిందని లావణ్య తెలిపి మరో పేల్చింది.
తాను గోవా వెళ్లిన సందర్భంలో రాజ్ తరుణ్.. అరియానాతో ఉండేవాడని.. అరియానా తన ఫ్లాట్‌కి రాజ్ తరుణ్ రప్పించుకునేదని.. వాళ్ల ఎఫైర్ విషయాన్ని రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్రే తనకి చెప్పాడని గతంలో చెప్పింది లావణ్య. ఈమె మాటల్లో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ.. తాజాగా ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్.. అరియానాకి కడుపు చేశాడంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది లావణ్య. మరి ఇందులో ఎంత నిజం ఉందొ కానీ ప్రస్తుతం మాత్రం లావణ్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.