Movie News

అమ్మాయిలకు కండోమ్స్ టిప్స్ చెప్పిన బోల్డ్ హీరోయిన్

ఇటీవల కాలంలో హీరోయిన్లు అన్ని విషయాలు ఓపెన్ అవుతున్నారు. ముఖ్యంగా పర్సనల్ విషయాలను సైతం షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే..అమ్మాయిలు ఎలాంటి కండోమ్స్ వాడాలి..ఎలా వాడాలి వంటి విషయాలు చెప్పి వార్తల్లో నిలిచింది. రాధికా ఆప్టే అంటే తెలియని సినీ లవర్స్ ఉండరు. తెలుగు లో బాలకృష్ణ సరసన లెజెండ్ తో పాటు మరికొన్ని మూవీస్ చేసిన ఈమె..ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ వస్తుంది.

ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ కండోమ్ గురించి చెప్పి ఆశ్చర్యపర్చింది. అమ్మాయిలూ కండోమ్ ఇలా వాడండి అంటూ ఏకంగా వీడియో వదిలింది. దీంతో ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. కండోమ్స్ విషయంలో మన సొంత నిర్ణయం ఎందుకు ఉండకూడదు అంటూ ఈ వీడియోలో అన్నీ ఓపెన్ గా మాట్లాడేసింది. ఎవరో ఏదో అనుకుంటారని చింతించకండి.. అమ్మాయిలు మీ కండోమ్ మీరే కొనుక్కోండి అంటూ ఓ కంపెనీకి చెందిన కండోమ్స్ చూపించింది. అయితే ఇది కంపెనీ ప్రమోషనల్ యాడ్ అని తెలుస్తున్నప్పటికీ ఓ స్టార్ హీరోయిన్ ఇలా పబ్లిక్ గా కండోమ్స్ గురించి మాట్లాడటం హాట్ టాపిక్ అయింది.