Movie Reviews

రివ్యూ : రాయన్ – ఆకట్టుకోలేకపోయాడు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రాయన్. 3 మూవీ నుంచి ఇక్కడ ధనుష్‌కు మంచి క్రేజ్ ఏర్పడగా.. రఘువరన్ బీటెక్‌తో ధనుష్ తెలుగు హీరోగా మారిపోయాడు. అప్పటి నుంచి ధనుష్ సినిమాలను తెలుగు వారు ఆదరిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ధనుష్ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించిన రాయన్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? కథ ఏంటి..? ధనుష్ డైరెక్టర్ గా మరో సక్సెస్ సాధించారా..? అనేది ఇప్పుడు చూద్దాం.

స్టోరీ :

ఓ ప్రాంతంలో కొందరి మధ్య జరిగే అధిపత్య పోరునే రాయన్ ‘అసలు’ కథ. నాయకుడుగా ఎదిగిన హీరోకు చెక్ పెట్టాడానికి శత్రువులందరు ఒకటవుతారు. వీరందర్ని హీరో ఎలా ఎదరించాడు. తనని నమ్ముకున్న వారికి హీరో ఎలా న్యాయం చేశాడనేది కథ.

రాయన్ (ధనుష్) తన ఇద్దరు తమ్ముళ్లు (సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషార విజయన్) కోసమే బతుకుతుంటాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమై.. తమ్ముళ్లు, చెల్లిని ఎంతో కష్టపడి పెంచుతాడు రాయన్. వీరికి శేఖర్ (సెల్వ రాఘవ) వీరికి ఆశ్రయం కల్పిస్తాడు. రాయన్ నివసించే ఏరియా దురై (శరవణన్) చేతి కింద ఉంటుంది. ఇక సేతు (ఎస్ జే సూర్య) ఆ ఏరియాపై పట్టు సాధించాలని అనుకుంటాడు. సిటీకి కొత్తగా వచ్చిన కమిషనర్ (ప్రకాష్ రాజ్) రౌడీ గ్యాంగ్‌లను ఏరిపారేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో రాయన్ పెద్ద తమ్ముడు ముత్తు (సందీప్ కిషన్)కు ఎదురైన పరిస్థితులు ఏంటి? తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాయన్ ఏం చేశాడు? చివరకు రాయన్‌కే తన తమ్ముళ్లు ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చింది? అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.

సినిమా ప్లస్ – మైనస్ లు చూస్తే..

ఫస్ట్ హాఫ్ అంత కూడా సాదాసీదా నడిచింది.. ఇంటర్వెల్‌ సెకండ్ హాఫ్ ఫై అంచనాలు పెంచింది. ఆ తరువాత రాయన్ కొద్ది సేపు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. మళ్లీ హాస్పిటల్ సీన్‌తో అదిరిపోతుంది. అక్కడ దుషార హైలెట్ అవుతుంది. అయితే సెకండాఫ్‌లో మరింత ఎమోషనల్ సీన్స్‌కు స్కోప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ధనుష్ ఆ యాంగిల్‌ను తీసుకోలేదు. అలా తీసుకుంటే మళ్లీ రొటీన్ అనే ఫీలింగ్ వస్తుందని అనుకున్నాడో ఏమో. కానీ రాయన్‌ను ఎలా చూసుకున్నా కూడా కొత్తగా అనిపించదు. కథ, స్క్రీన్ ప్లే ఇలా అన్నీ కూడా పాత పద్దతిలోనే సాగినట్టుగా అనిపించింది. మన తెలుగు ఆడియన్స్ కు ఈ చిత్రం ఏమాత్రం నచ్చదు.

ధనుష్ యాక్టింగ్ కు వంక పెట్టాల్సిన అవసరం లేదు. తనదైన స్టయిల్ లో అదరగొట్టాడు. రా అండ్ రస్టిక్ రోల్‌లో ధనుష్ మరోసారి అద్భుతం చేసాడు. గుండు చేయించుకుని ధనుష్ డీ గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. సందీప్ కిషన్‌కు మంచి పాత్ర దొరికింది. అపర్ణా బాలమురళీకి సరిపడే పాత్ర అయితే లభించలేదనిపిస్తుంది. ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. ఎస్ జే సూర్య ఎప్పటిలానే అదరగొట్టేశాడు. ఈ సినిమాకు దుషార విజయన్ కారెక్టర్ హైలెట్ అనిపిస్తుంది. ఇలాంటి కారెక్టర్ దొరకడం కూడా కష్టమే. దొరికిన పాత్రని దుషార దుమ్ములేపేసింది. సెల్వ రాఘవన్, ప్రకాష్ రాజ్ ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి. వరలక్ష్మీ శరత్ కుమార్‌ స్థాయికి తగ్గ కారెక్టర్ దక్కలేదనిపిస్తుంది. ఫైనల్ గా మాత్రం కథ లో కాస్త కొత్తదనం ఉంటె బాగుండు.