Tuesday, December 24, 2024
HomeMovie News3రోజుల్లోనే 50మిలియన్లు అది కదా పుష్ప రాజ్ రేంజ్

3రోజుల్లోనే 50మిలియన్లు అది కదా పుష్ప రాజ్ రేంజ్

- Advertisement -

స్టయిలిష్ స్టార్ కాస్త ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఆలా వైకుంఠపురం లో మూవీ తో పాన్ ఇండియా గా పర్వాలేదు అనిపించుకున్న అల్లు అర్జున్..పుష్ప తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సినిమా విడుదలై చాల నెలలు అవుతున్న ఇంకా దీని స్వింగ్ మాత్రం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో పుష్ప 2 అప్డేట్స్ అభిమానుల్లో మరింత జోష్ , అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా చిత్రంలోని పుష్ప …పుష్ప సాంగ్ విడుదలై..మూడు రోజుల్లోనే ఏకంగా 50మిలియన్లు వ్యూస్ రాబట్టి అల్లు అర్జున్ రేంజ్ ఏంటో చూపించింది.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా ఆరు భాషల్లో రిలీజైన ఈ పాట యూట్యూబ్​లో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఆరు భాషల్లో కలిపి ఈపాట 50+ మిలియన్ వ్యూస్ దాటింది. ఈ క్రమంలో ఫాస్టెస్ట్​గా 50 మిలియన్ వ్యూస్​ సాధించిన పాటగా రికార్డ్ కొట్టింది. ఇదే సమయంలో దాదాపు 15 దేశాల్లో పుష్ప పుష్ప పాట ట్రెండింగ్​లో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ పాటపై ఇన్​స్టాగ్రామ్​లో నెటిజన్లు లక్షకుపైగా రీల్స్​ కూడా చేశారు. అంటే సోషల్ మీడియాలో పుష్ప హవా ఏ రేంజ్​లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క పాటకే ఈరేంజ్ రెస్పాన్స్​ లభిస్తే, ఫుల్ మూవీ రిలీజ్ అయ్యాక పుష్ప రాజ్ ఏ లెవల్​లో రికార్డులు తిరగరాస్తాడో! అని ప్రతిఒక్కరు మాట్లాడుకుంటున్నారు.

నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే’ అంటూ సూపర్ లిరిక్స్​ను సాంగ్​కు అందించారు లిరిసిస్ట్ చంద్రబోస్. ఇందులో పుష్పరాజ్‌ మ్యానరిజంను ఎంతో చక్కగా వివరించారు. ఇక సినిమా రిలీజ్​లోపు ఈ పాట 100 మిలియన్ క్లబ్​లోకి ఈజీగా చేరుతుంది. ఈ సీక్వెల్‌ను వరల్డ్ వైడ్​గా ఆగస్ట్ 15న గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read