Movie News

కేవలం అల్లు అర్జున్ కు మాత్రమే ఇలాంటి రికార్డ్స్ సాధ్యం

టాలీవుడ్ రికార్డు కొట్టాలన్న..రికార్డ్స్ తిరగరాయాలన్న అల్లు అర్జున్ కే సాధ్యం అంటున్నారు ఆయన ఫ్యాన్స్. తాజాగా ఆయన నటిస్తున్న పుష్ప 2 నుండి రిలీజ్ అయినా ‘కపుల్ సాంగ్’ యూట్యూబ్లో అదరగొడుతోంది. 3 రోజుల్లోనే తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో 53M వ్యూస్, 1.16M లైక్స్ సొంతం చేసుకొని. ట్రెండింగ్-1 లో కొనసాగుతోందని తెలిపారు.

ఇప్పటికే పుష్ప-2 నుండి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చి అందర్నీ ఆకట్టుకోగా..ఇప్పుడు రెండో సాంగ్ వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లాభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది.. పుష్ప డైలాగ్సే మారుమ్రోగుతున్నాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా సినిమా సాంగ్స్ ఫై కూడా అంతే విధంగా ఎదురుచూస్తున్నారు.

‘పుష్ప’లో ‘నా సామి…’ పాటకు రష్మిక వేసిన స్టెప్పులు ప్రేక్షకుల్ని అలరించారు. ఆ సినిమాలో పుష్పను ‘నా సామి’ అన్న శ్రీవల్లి… ఈ సినిమాలో ‘మహారాజు’ అంటూ తన భర్త గురించి పాడటం విశేషం.

‘వీడు మొరటోడు…
అని వాళ్ళు వీళ్ళు ఎనెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడు!
వీడు మొండోడు…
అని ఊరూ వాడా అనుకున్నా గానీ
మహారాజు నాకు నా వాడు!

మాట పెళుసైనా… మనసులో వెన్న!
రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసు నాకన్నా
సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి”
అంటూ సాగిన ఈ గీతానికి తెలుగులో ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ (Oscar Winner ChandraBose) సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు. ప్రజెంట్ ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.