Movie News

తుది దశకు చేరుకున్న పుష్ప-2 షూటింగ్..

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లాభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది.. పుష్ప డైలాగ్సే మారుమ్రోగుతున్నాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా సినిమా సాంగ్స్ ఫై కూడా అంతే విధంగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ తుదిదశకు చేరుకుందని, మూవీ టీమ్ ప్రస్తుతం క్లెమాక్స్ సీన్స్ షూట్ చేయడంపై దృష్టి పెట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ వారం నుంచి రెండు వారాలకు పైగా పతాక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఆ తర్వాత స్పెషల్ సాంగ్ షూట్ ఉంటుందని సమాచారం. ఈ పాటలో త్రిప్తి దిమ్రి నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది.