Monday, December 23, 2024
HomeMovie Newsడిసెంబర్ లో పుష్ప 2 ..?

డిసెంబర్ లో పుష్ప 2 ..?

- Advertisement -

పుష్ప 2 ఇప్పట్లో రావడం కష్టమేనా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లాభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది.. పుష్ప డైలాగ్సే మారుమ్రోగుతున్నాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 న ఈ సినిమా వస్తుందని ముందు నుండి చెపుతూ వచ్చిన మేకర్స్ ఇప్పుడు చెప్పిన సమయానికి రావడం లేదని చెప్పడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తుంది.

పుష్ప-2 టీం స‌భ్యుల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా వాయిదా నెలా రెండు నెల‌లకు ప‌రిమితం కాద‌ట‌. సినిమా నిడివితో పోలిస్తే రెట్టింపు ర‌ష్ ఉంటుంద‌ని.. దాన్ని ఎడిట్ చేయ‌డం.. అన్ని భాష‌ల‌కు క‌లిపి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ చేయ‌డం.. సీజీ వ‌ర్క్ అంతా ఒక కొలిక్కి తేవ‌డం.. ఈ వ్య‌వ‌హారాల‌న్నీ చాలా టైం తీసుకునేవే. కాబ‌ట్టి ఆగ‌స్టు 15 నుంచి ఇంకో ఐదు నెల‌లైనా ప‌డుతుంది ఫ‌స్ట్ కాపీ తీయ‌డానికి. కాబ‌ట్టి ఆగ‌స్టు మిస్ అయితే సెప్టెంబ‌రు లేదా అక్టోబ‌రు అనుకోవ‌డానికి కూడా లేదు. బ‌హుశా పుష్ప‌-1ను రిలీజ్ చేసిన‌ట్లే పుష్ప‌-2ను డిసెంబ‌రులో విడుద‌ల చేయొచ్చ‌న్న‌ది చిత్ర వ‌ర్గాల అంచ‌నా. అదే జ‌రిగితే డిసెంబ‌రులో రావాల్సిన చాలా సినిమాల రిలీజ్ డేట్ల‌ను మార్చుకోక త‌ప్ప‌దు. చూద్దాం ఏంచేస్తారో మరి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read