Friday, October 18, 2024
HomeMovie Newsబన్నీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్…

బన్నీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్…

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లాభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది.. పుష్ప డైలాగ్సే మారుమ్రోగుతున్నాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అదే విధంగా సినిమా సాంగ్స్ ఫై కూడా అంతే విధంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్(సూసేకి అగ్గి ర‌వ్వ) సోష‌ల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాను ఆగస్టు 15 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందు నుండి చెపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు చెప్పిన సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకరావడం లేదని తెలుస్తుంది.

ఈ మూవీ షూటింగ్ జూన్ ఎండింగ్ నాటికి ముగించాలని అల్లు అర్జున్ ఆర్డ‌ర్ వేసిన‌ట్లు స‌మాచారం. అయితే షూటింగ్ పూర్తి కావడానికి ఇంకో నెల స‌మ‌యం ప‌డుతుంద‌ని. ఇప్ప‌టికే కొన్ని ఎపిసోడ్‌లను సుకుమార్ రీడిజైన్ చేసిన‌ట్లు తెలుస్తుంది. దీంతో ఈ షూటింగ్ ఎఫెక్ట్ ప‌డిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో సుకుమార్ కన్విన్స్ కాకపోవడంతో అవి పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుంద‌ని తెలుస్తుంది. దీంతో సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు చెపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం ఫుల్ ట్రెండ్ అవుతోంది. కాగా, దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read