Monday, December 23, 2024
HomeMovie News'పుష్ప 2' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే..

‘పుష్ప 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే..

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన “పుష్ప 2: ది రూల్” బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో అత్యంత పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని థియేటర్లకు ఆకర్షిస్తూ కలెక్షన్ల పరంగా సరికొత్త మైలురాళ్లను చేరుకుంది. కమర్షియల్ సినిమాల్లో ఇప్పటివరకు ఏ చిత్రానికి సాధ్యం కాని విధంగా, ఈ చిత్రం అపూర్వ విజయాన్ని అందుకుంది.

తాజాగా పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. పలు పోస్టర్లు, రూమర్స్ ఈ క్రమంలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వార్తలపై మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. థియేటర్ల విడుదల తేదీ నుంచి 56 రోజుల కంటే ముందుగా ఎలాంటి ఓటీటీ విడుదల జరగదని స్పష్టం చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. “పుష్ప 2పై వస్తున్న వార్తలు అసత్యం. ఇది వైల్డ్ ఫైర్ పుష్ప. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోనే ఆస్వాదించండి. 56 రోజుల గడువు ముగిసే వరకు ఎక్కడా ఓటీటీలో ప్రసారం చేయబడదు” అంటూ స్పష్టం చేశారు.

ఈ ప్రకటనతో పుష్ప 2 చిత్రాన్ని థియేటర్లలో చూడాలని అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాలీడే సీజన్‌లో పుష్ప 2ను వెండితెరపై చూసే అనుభవాన్ని ఎంజాయ్ చేయాలని చిత్రబృందం కోరుకుంటోంది. ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై ప్రపంచవ్యాప్తంగా విజయవంతమవుతుండటంతో, ఓటీటీ విడుదలపై క్లారిటీ రావడం పట్ల ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప 2 మరోసారి అల్లు అర్జున్‌ నటనకు చాటి చెప్పే ఘనతను తెచ్చిపెట్టింది. సుకుమార్ రచన, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, చిత్ర కథనంలో వినూత్నత, ప్రతి అంశం ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోపెట్టేలా చేసింది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read