Monday, December 23, 2024
HomeMovie Newsరేపటి నుండి పుష్ప 2 తాజా షెడ్యూల్ స్టార్ట్

రేపటి నుండి పుష్ప 2 తాజా షెడ్యూల్ స్టార్ట్

- Advertisement -

అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ (Pushpa 2: The Rule) మూవీ డిసెంబర్ 06 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత కొద్దీ రోజులుగా పలు కారణాలతో షూటింగ్ కు బ్రేక్ పడగా..రేపటి నుండి తాజా షెడ్యూల్ మొదలుకాబోతుంది. హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. బన్నీ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లాభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది.. పుష్ప డైలాగ్సే మారుమ్రోగుతున్నాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వారి అంచనాలకు తగ్గట్లే సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read