ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో తెలుగు సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపారు.. ఏపీ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్‌తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ ముఖ్య సమావేశానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్‌తో పాటు అశ్వినీదత్, చినబాబు, నవీన్ రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్యలు తదితరులు కలిశారు.
సమావేశం అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు మా అందరికీ సంతోషకరమైన రోజు అని చెప్పారు. మనస్ఫూర్తిగా అన్ని విషయాలు పవన్‌తో చర్చించినట్లు తెలిపారు. టికెట్ల రేటు అనేది చాలా చిన్న విషయం అని అంతకంటే పెద్ద విషయాలు చాలానే ఉన్నాయన్నారు. త్వరలో ఇండస్ట్రీ గురించి రిప్రెండేషన్ ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అపాయింట్మెంట్ కోరినట్లు చెప్పారు. చంద్రబాబు, పవన్ లకు సన్మానం చెయ్యడానికి సమయం అడిగినట్లు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సినీ పరిశ్రమ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. ఓ పక్క కరోనా పరిస్థితుల కారణంగా కుదేల్ అయిన ఇండస్ట్రీని ఆదుకోవడం పక్కన పెడితే.. వేధింపులకు గురిచేసిందనే విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో వారి పాలనలో అనేక ఇబ్బందులు, సమస్యలకు సినీ పరిశ్రమ గురైంది. టికెట్ రేట్లు చాలా నాసిరకంగా, అతి తక్కువ ధరకు కోట్ చేసింది ఆ ప్రభుత్వం. పోలీసులను, అధికారులను ఉసిగొల్పి.. కొన్ని చోట్ల థియేటర్లను సీజ్ కూడా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ పరిస్థితులను వివరించడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఓ టీమ్ అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసింది. అయితే ఆ సమయంలో చేతులు జోడించి వేడుకొన్న చిరంజీవి.. విషయం అత్యంత వివాదాస్పదంగా మారింది. అగ్ర హీరోలందరూ కూడా చేసిన వినతులను బుట్టదాఖలు చేయడంతో ఇండస్ట్రీ మరింత ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం అనేక సమస్యలతో ఉన్న ఇండస్ట్రీకి సహకారం అందించాలనే వినతులతో మర్యాదపూర్వకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన తెలుగు సినీ నిర్మాతల సమావేశం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారితో తెలుగు సినీ నిర్మాతల భేటీ
ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించిన నిర్మాతలు, సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని హామీ ఇచ్చిన గౌ. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. pic.twitter.com/oCqZghQ8Zt— JanaSena Party (@JanaSenaParty) June 24, 2024