Tuesday, December 24, 2024
HomeMovie Newsఆహా లో సరికొత్త రికార్డు సృష్టించిన ''ప్రేమలు''

ఆహా లో సరికొత్త రికార్డు సృష్టించిన ”ప్రేమలు”

- Advertisement -

ఆహా ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఫై ప్రేమలు మూవీ సరికొత్త రికార్డు సృష్టించింది. గతనెల ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటివరకు 125 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్​తో ఆహా ఫ్లాట్ ఫామ్ ఫై కొత్త రికార్డు అందుకుంది. ఒక మలయాళ డబ్బింగ్ సినిమా ఈ రేంజ్​లో స్ట్రీమింగ్ అవ్వడం ఇదే మొదటిసారి అని ఆహా తెలిపింది. ఈ క్రమంలో ఓటీటీలో అత్యధిక నిమిషాలు స్ట్రీమింగ్​ అయిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది.

గిరీశ్ ఏడి ఈ సినిమాను డైరెక్ట్ చేయగా.. విష్ణు విజయ్ మ్యూజిక్ అందించారు. దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేయడం విశేషం. ఇక ఈ మూవీలో నస్నెన్ కే గఫార్, మమితా బైజు, శ్యామ్ మోహన్, మీనాక్షీ రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీమ్, మ్యాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్ తదితరులు నటించారు. కామెడీ, ఫీల్​గుడ్ లవ్​స్టోరీ నో యాక్షన్, జీరో ఫైట్ సీన్స్​తో తెరకెక్కిన ఈ సినిమాకు యూత్ బ్రహ్మ రథంపట్టారు. దీంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇక్కడ కూడా ప్రేమలు మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు 90’s బయోపిక్ వెబ్​ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ రాయడంతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరైంది. చిన్న సినిమాగా కేవలం రూ.9 కోట్ల బడ్జెట్​తో రూపొందిన ప్రేమలు వరల్డ్​వైడ్​గా రూ.100 కోట్లు పైగా వసూల్ చేసింది. కథలో దమ్ము ఉండాలి కానీ కాస్ట్ & క్రూ తో సంబంధం లేదని నిరూపించింది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read