Movie News

తెలుగు లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రేమలు బ్యూటీ

టాలీవుడ్ లో ఇతర భాషల హీరోయిన్ల ఎంట్రీ అనేది కామన్. ఇప్పటికే ఎంతో మంది ఎన్నో భాషల నుండి భామలు తెలుగులో ఎంట్రీ ఇచ్చి స్టార్ స్థాయికి చేరుకోవడమే కాదు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు మరో బ్యూటీ ఎంట్రీ కాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రేమలు చిత్రంతో యూత్ ను ఆకట్టుకున్న మమిత బైజు..ఇప్పుడు తెలుగు లో ఎంట్రీ ఇస్తుంది.

ప్రేమలు’ వంటి డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మమిత బైజు. తన క్యూట్ లుక్స్, ఎక్స్ప్రెషన్స్, స్మైల్ తో ఆకట్టుకొని అమ్మడు యూత్ కి క్రష్ గా మారిపోయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఎస్.ఎస్. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రశంసలు అందుకోవడంతో.. టాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టి మమిత మీద పడింది. ఇప్పటికే ఆమె కొన్ని తెలుగు ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మమిత బైజు తన మొదటి తెలుగు చిత్రానికి సైన్ చేసిందని, అది కూడా మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో అని టాక్ వినిపిస్తోంది.

‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్ట్రెయిట్ తెలుగు మూవీ రూపొందించనున్నట్లు సమాచారం. దీని కోసం మమితా బైజుని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని, తమిళ మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేసే ఆలోచనతో ప్రదీప్ కు జోడీగా మమితను ఫిక్స్ చేసినట్లుగా చెపుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.