నారా రోహిత్ హీరోగా.. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘ప్రతినిధి 2’. తొమ్మిదేళ్ల కిందట ఆయన హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుంది. మే 10 న ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ తాలూకా టీజర్ , ట్రైలర్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసారు.
ఈ ట్రైలర్ లో ‘నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. సీఎంను ఎందుకు చంపాలనుకున్నావ్?’ అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత జర్నలిస్ట్ నారా రోహిత్ తో.. సినిమాలోని పొలిటికల్ లీడర్ సీఎంను చంపడమంటే మాకే నష్టం, సింపతీ వాళ్లకే వర్కౌట్ అయిద్ది, ఆ మాత్రం తెలియదా? అనే ప్రశ్న మరింత ఆసక్తిగా మార్చింది. ఇక ట్రైలర్ లో చిన్నపాటి ఫైట్ సీన్ ను కూడా యాడ్ చేశారు మేకర్స్. ‘పవర్ మన చేతిలో ఉంటే.. కేసులన్నీ కోర్టులో ఉంటాయి’ అనే డైలాగ్ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను ఎత్తి చూపేలా ఉంది. ‘దేశానికి కాపాడడానికి సైనికుడు, కడుపు నింపడానికి రైతు, సొసైటీకి జర్నలిస్ట్ అవసరం సర్’ అంటూ నారా రోహిత్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మహతి స్వర సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవల్ లో ఉందని చెప్పవచ్చు. ట్రైలర్ చూస్తుంటే ఇది పక్క టిడిపి కి సపోర్ట్ గా , వైసీపీ కి వ్యతిరేకంగా సినిమా తెరకెక్కించినట్లు అర్ధం అవుతుంది. మరి నిజంగా సినిమా ఆలా ఉందా..లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ & రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.