కల్కి విజయం తో ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్లు ఫిలిం సర్కిల్లో అంత మాట్లాడుకుంటున్నారు. కల్కి చిత్రంలో నటించినందుకు గాను ప్రభాస్ రూ.150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బాహుబలి2 తర్వాత ప్రభాస్ పారితోషికంగా భారీగా పెరిగింది. అయితే కల్కి తర్వాత చేయబోయే చిత్రాలకు ప్రభాస్ రూ.200 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అంత ఇవ్వాలంటే కష్టమని నిర్మాతలు అంటున్నారు. ఈ విషయంలో ప్రభాస్ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఒక్క రాజా సాబ్ చిత్రానికి మాత్రం తన పారితోషికాన్ని తగ్గించారు.
ఆదిపురుష్ సినిమాను నైజాంలో విడుదల చేసిన ఈ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ కు రూ.40 కోట్ల నష్టం రావడంతో తన పారితోషికం నుంచి రూ.40 కోట్లు తగ్గించారు. ప్రభాస్ పారితోషికం పెంచారని, ఇతర స్టార్ హీరోలు కూడా తమ పారితోషికాన్ని పెంచేందుకు సిద్ధపడుతున్నారు. లేదంటే పరిశ్రమలో తమకు డిమాండ్ తగ్గిపోయినట్లవుతుందని, అలా పెంచకపోతే మార్కెట్ లో తమకు డిమాండ్ లేదని మిగతావారు భావిస్తారనే ఉద్దేశంతో వీరంతా రెమ్యునరేషన్ పెంచడానికి సిద్ధపడుతున్నారు. ఇలా వరుసపెట్టి హీరోలు రెమ్యూనరేషన్ పెంచితే ఆ ప్రభావం ప్రేక్షకుల ఫై పడుతుందని వాపోతున్నారు.