Wednesday, July 24, 2024
HomeMovie Newsకల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానంటున్న ప్రభాస్..కారణం అదేనా..?

కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానంటున్న ప్రభాస్..కారణం అదేనా..?

- Advertisement -

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపించడం ఖాయమని అంత భావిస్తున్నారు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది.

‘క‌ల్కీ 2892 ఏడీ’కి అశ్వినీ ద‌త్ ప్రొడ్యూస‌ర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అశ్వినీ ద‌త్ అమ‌రావ‌తిలో నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి రావ‌డం, అమ‌రావ‌తి రాజ‌ధాని అని ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డే ఈవెంట్ గ్రాండ్ గా నిర్వ‌హించాల‌ని భావించార‌ట‌. ఇక ఈ ఈవెంట్ కి సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ని చీఫ్ గెస్ట్ లుగా పిలిస్తే సినిమాకి ఇంకా హైప్ పెరుగుతుంద‌ని అనుకున్నార‌ట సినిమా టీమ్. ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఉన్న క్రేజ్, చంద్ర‌బాబుకి ఉన్న రాజ‌కీయా ప‌లుకుబ‌డి క‌లిసొస్తుంద‌ని భావించి వాళ్ల‌ను చీఫ్ గెస్ట్ లుగా పిలుస్తార‌నే టాక్ ఇండ‌స్ట్రీలో గ‌ట్టిగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ప్ర‌భాస్ మాత్రం ఈవెంట్ ని అమ‌రావ‌తిలో నిర్వ‌హించేందుకు స‌సేమిరా అన్నార‌ని వార్తలు వస్తున్నాయి. అమ‌రావ‌తిలో నిర్వ‌హిస్తే సినిమాకి, త‌న‌కి ఇద్ద‌రికీ పొలిటిక‌ల్ రంగు అంటుకుంటుంద‌ని, ఫ్యాన్స్ మ‌ధ్య కూడా గొడ‌వ‌లు జ‌రిగే అవ‌కాశం చాలా ఉంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ని స‌న్నిహితులు చెప్పారు. త‌న మాట‌ను కాద‌ని అమ‌రావ‌తిలో నిర్వ‌హిస్తే తాను ఈవెంట్ కి రాన‌ని ప్ర‌భాస్ తేల్చి చెప్పిన‌ట్లు సినీ ఇండ‌స్ట్రీలో టాక్. ఈవెంట్ ని హైద‌రాబాద్ లోనే నిర్వ‌హించాల‌ని ప్ర‌భాస్ ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈవెంట్ ఎక్క‌డ అనేది క్లారిటీ రాలేదు. ఒక‌వేళ హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తే చంద్ర‌బాబు, ప‌వ‌న్ కల్యాణ్ ఈవెంట్ కి వ‌స్తారా? లేదా? అనేదానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read