ప్రభాస్ నడిచిన పాన్ ఇండియా మూవీ కల్కి ఈ నెల 27 న అనేక భాషల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ను ప్రభాస్ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఈ కల్కి ఆ ఖాతాలో పడుతుందని అభిమానులు ధీమా గా ఉన్నారు. ఇప్పటీకే విడుదలైన ట్రైలర్స్ సినిమా ఫై పాజిటివ్ బజ్ ను తీసుకొచ్చాయి.
ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ విదేశాలకు టూర్ వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రభాస్ తాను నటించిన సినిమాల విడుదల సమయంలో మాత్రమే విదేశాలకు టూర్ కి వెళ్తూ ఉంటాడు.. కానీ ప్రస్తుతం నటిస్తున్న కల్కి 2898AD చిత్రం ఇంకా విడుదలకు ఐదు రోజుల సమయం ఉన్నప్పటికీ..ముందుగానే ప్రమోషన్స్ లో పాల్గొనకుండా యూరోప్ వెళుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ తర్వాత సినిమాపై హైప్ పెంచడానికి ప్రమోషన్స్ చేపట్టాల్సి ఉంటుంది.. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టేసి వెళ్తున్నారు ప్రభాస్ అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆయన యూరప్ వెళ్ళే ఫోటోలు షేర్ చేస్తే కానీ తెలియదు.
ఇక కల్కి విషయానికి వస్తే..సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో కల్కి 2898 ఏడి అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగం కానున్నారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన అమితాబ్ బచ్చన్ లుక్ , కమలహాసన్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పవచ్చు. ఇంకా ఇందులో దీపికా పదుకొనే, దిశాపటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.