Movie News

ప్రభాస్ ను ఆట పట్టించిన బిగ్ బి

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపించడం ఖాయమని అంత భావిస్తున్నారు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. జూన్ 27 పాన్ ఇండియా పలు భాషల్లో విడుదల కాబోతుండడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరు పెంచారు.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో దీపికా పదుకొనేతో పాటు ప్రభాస్, అమితాబ్, రానా , కమల్ హాసన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక దీపికా పదుకొనే కూడా నలుపు రంగు దుస్తులను ధరించి బేబీ బంప్ తో స్టైలిష్ గా కనిపించింది. అయితే వేదిక పైకి దీపికను ఆహ్వానించినప్పుడు ప్రభాస్ ఆమెను చేయి పట్టుకుని మెట్లు ఎక్కి రావడానికి హెల్ప్ చేయాలని చూశాడు. వెంటనే అమితాబ్ వచ్చి ప్రభాస్ చేసిన పనిపై జోక్ వేస్తూ ఆటపట్టించినట్టు కనిపించింది. అయితే నిజానికి ప్రభాస్ కంటే ముందు అమితాబ్ దీపికాకు హెల్ప్ చేస్తూ కనిపించారు. ఆయన ముందు దీపికాకు చేయి అందించగా, ఆ తర్వాత ప్రభాస్ హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు. దీంతో ప్రభాస్ హెల్ప్ చేస్తే అమితాబ్ జోక్ చేశాడు గానీ ముందుగా ఆయనే హెల్ప్ చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ముంబైలో జరిగిన ఈవెంట్ తో సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు మేకర్స్.