డైరెక్టర్ త్రివిక్రమ్ మీద నిత్యం కౌంటర్లు, కామెంట్స్ వేసే పూనమ్ కౌర్..మరోమారు ట్వీట్ చేసి ఆయన పరువు తీసింది. ప్రస్తుతం ప్రణీత్ హన్మంతు అనే ఓ యూట్యూబర్ ఫై పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తండ్రీకూతుళ్ల సాన్నిహిత్యం ఫై ఇతడు చేసిన కామెంట్స్ ఫై ప్రపంచం మొత్తం ఛీ కొడుతుంది. ఇలాంటి వాడికి తగిన శిక్ష విదిస్తే..మరోసారి ఇలాంటి పనులు ఎవ్వరు చేయరంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిత్రసీమ నుండి సైతం ప్రణీత్ హన్మంతు ఫై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నారు.
ఈ క్రమంలో నెటిజన్ చేసిన కామెంట్‌కు పూనమ్ కౌర్ కౌంటర్ వేసింది. రేప్ అనే విషయం మీద తేజ్ స్పందించిన తీరుకు.. జల్సా సినిమాలోని ఓ సీన్‌ను చూపించాడు సదరు నెటిజన్. పడుకుని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తది అంటూ బ్రహ్మానందంతో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌ను చూపించి.. ఇలాంటి వాటి వల్లే యూత్ చెడిపోతోందని, ముందు వీళ్ల మీద చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజన్ కౌంటర్ వేశాడు.
నెటిజన్ వేసిన ట్వీట్‌కు పూనమ్ కౌర్ రిప్లై ఇచ్చింది. డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్.. అంతకంటే గొప్పగా ఏం రాస్తాడు.. అంత కంటే ఎక్కువగా ఆశించొద్దు అని కౌంటర్ వేసింది. పూనమ్ వేసిన ట్వీట్ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అసలు జరిగిన మ్యాటర్ ఏంటి? ఆ గొడవ ఏంటి? త్రివిక్రమ్‌తో మీకున్న సమస్య ఏంటి? అని నెటిజన్లు అడుగుతున్నారు. కానీ పూనమ్ మాత్రం ఇంత వరకు జరిగిన విషయాన్ని నేరుగా చెప్పలేదు. పూనమ్ మాత్రం సందు దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ మీద కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. ఒకప్పుడు గురూజీ అంటూ పరోక్షంగా సెటైర్లు వేసేది. కానీ ఈ మధ్య మాత్రం నేరుగా త్రివిక్రమ్ అని పేరు పెట్టి ట్రోలింగ్ చేస్తోంది.