ప్రముఖ తమిళ నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజాపై పోలీసు కేసు నమోదైంది. ఆయన ఇంట్లో పని చేసే మహిళ(లక్ష్మీ), కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జ్ఞానవేల్ రాజా, తన తల్లిపై దొంగతనం ఆరోపణలు చేశారని, అందుకే ఆమె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొంది.
చెన్నైలోని టి నగర్లో జ్ఞానవేల్ రాజా నివాసం ఉంటున్నారు. ఇంట్లో తన భార్య నేహా నగలు కనిపించకపోవడంతో, పనిమనిషి లక్ష్మీపై ఆయన దొంగతనం ఆరోపణలు చేశారు. లక్ష్మీనే దొంగతనానికి పాల్పడినట్లు అనుమానిస్తూ మాంబలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తట్టుకోలేక ఆమె ఆత్మహత్నంకు పాల్పడింది. అదృష్టవశాత్తూ, చుట్టుపక్కల వాళ్లు గమనించడంతో వెంటనే ఆమెను చెన్నై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. తన తల్లిపై చేయని నేరాన్ని మోపారని చెప్పి జ్ఞానవేల్ రాజా ఫై ఆమె కూతురు పిర్యాదు చేసింది.
స్టూడియో గ్రీన్ బ్యానర్ ఫై జ్ఞానవేల్ రాజా సిల్లును ఒరు కాదల్, పరుత్తివీరన్, సింగం, సిరుత్తై, ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా, మద్రాస్, బిరియానీ, ఇంద్రు నేట్రు నాలై వంటి హిట్ సినిమాలు నిర్మించారు. సూర్య హీరోగా 2017లో వచ్చిన యాక్షన్ మూవీ సింగం 3ని కూడా ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.