Movie News

“పోకిరి” నుంచి నా గుండె జారిపోయిందే సాంగ్ లాంచ్

వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణంలో, ఆయన హీరోగా నటిస్తున్న సినిమా “పొకిరి”. ఈ సినిమాలో మమతా హీరోయిన్ గా నటిస్తుండగా, వికాస్ దర్శకుడిగా పని చేస్తున్నారు. వరుణ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా, ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమాపై విశేషాలను పంచుకున్నారు.

హీరోయిన్ మమతా మాట్లాడుతూ, “ఇది నా ఫస్ట్ ఎక్స్‌పీరియెన్స్. డైరెక్టర్ వికాస్ గారికి, వరుణ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా గురించి చెప్పాలంటే, యూనిటీ గుర్తొస్తుంది. ఇదొక మంచి సినిమా. అందరూ ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

దర్శకుడు వికాస్ మాట్లాడుతూ, “మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి ‘పొకిరి’ అనే టైటిల్ అనుకున్నాం. వేరే టైటిల్స్ పెట్టాలని అనుకున్నప్పటికీ, ‘పొకిరి’నే సరైన టైటిల్ గా భావించాం. కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమాకు చాలా శ్రద్ధ వేశాం. ఈ సినిమా బాగా హిట్ అవుతుందని మేము నమ్ముతున్నాం” అని అన్నారు.

హీరో మరియు నిర్మాత వరుణ్ రాజ్ మాట్లాడుతూ, “ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడతాం. ఈ సినిమా హిట్ అవుతుందని మాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. అలాగే, చిరంజీవి గారికి, మహేష్ బాబు గారికి కూడా ఎంతో అభిమానిని. ఈ సినిమా టైటిల్ లోనే నాకు దమ్ముంది. ‘పొకిరి’కి ఓనర్ మహేష్ బాబు గారే. మేమంతా వారి అభిమానులమే!” అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, “ఈ సినిమాకు పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడటం కన్నా నా మ్యూజిక్ మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నాను. మా సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నాను” అని చెప్పారు.

“పొకిరి” సినిమా అందరినీ ఆకట్టుకునే విధంగా రూపొందుతున్నట్లు యూనిట్ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

బ్యానర్: రాజా మూవీస్
టైటిల్: పోకిరి
దర్శకుడు: వికాస్
నిర్మాత: వరుణ్ రాజు
సమర్పకులు: ప్రమోద్ రాజు
హీరో: వరుణ్ రాజు
హీరోయిన్: మమతా రెడ్డి
సంగీతం: ఉదయ్ కిరణ్ UK
కెమెరా: వెంకీ & వంశీ
నటీనటుల: చిత్రమ్ శ్రీను, సూర్య, గంగవ్వ, బెనర్జీ, సత్య ప్రకాష్, మరియు తదితరులు
పి ఆర్ ఓ : మధు విఆర్