Friday, October 18, 2024
HomeMovie Newsమీ తమ్ముడు మామూలోడు కాదు..చిరుతో మోడీ

మీ తమ్ముడు మామూలోడు కాదు..చిరుతో మోడీ

- Advertisement -

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలనేది ఆయనకే కాదు, ఆయన మద్దతుదారులకు కూడా చిరకాల స్వప్నం. పిఠాపురం ప్రజల ఆశీర్వాదంతో పవన్‌ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భారీ మెజారిటీ తో అయన విజయం సాధించడమే కాదు..జనసేన తరఫున పోటీ చేసిన 21 మంది కూడా గెలవడంతో అందరూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయన భార్య అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. స్టేజీ పై ఒక వైపు నుంచి మరో వైపున ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చారు ప్రధాని మోదీ. ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని. ఈ సందర్భంగా మెగా బదర్స్‌లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read