టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమా వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్ యు. మీ ద్వారా సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మాకు ఎప్పుడూ ఆనందం. చాలా మంచి టీం తో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది. రధన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. బాల్ రెడ్డి గారి విజువల్స్ చాలా వండర్ ఫల్ వుంటాయి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ ఈ సినిమాని వోన్ చేసుకుని సొంత సినిమాలా వర్క్ చేశారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాతో చాలామంది కొత్తవారు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పేర్లు చాలా గట్టిగా వినిపిస్తాయి. నితిన్ భరత్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. సరికొత్త స్టైల్ ని స్క్రీన్ పై చూపించబోతున్నారు. సందీప్ రాసిన కథ డైలాగ్స్ చాలా రీసౌండ్ చేస్తాయి. భరత్ నితిన్ ఈ సినిమా ద్వారా నాకు బ్రదర్స్ లాగా దొరికారు. మా యూనిట్ మొత్తానికి రాజకుమారి దీపిక. మేము కూడా తనని రాజకుమారిలాగే చూసుకున్నాం. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సపోర్టుతో తొలి అడుగు వేసాం. ఆయన మా సాంగ్ ని లాంచ్ చేయడం మాకెంతో బలాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సినిమా మొట్టమొదటి టికెట్ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పర్చేజ్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఈ సినిమా గురించి తెలుసుకుని ఇంటికి పిలిపించి మాట్లాడారు. ఆ సపోర్ట్ ని మేము మర్చిపోలేం. రామ్ చరణ్ గారు ‘పెద్ది ఫర్ ప్రదీప్’ అని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. షూటింగ్లో చాలా బిజీగా ఉంటూ కూడా మాకు సమయాన్ని కేటాయించి సపోర్ట్ చేసిన రామ్ చరణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ట్రైలర్ చూశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. రామ్ చరణ్ గారు మా అందరితో సరదాగా ఇన్వాల్వ్ అవుతూ టికెట్ ని ఫస్ట్ టికెట్ ని పర్చేజ్ చేయడం మాకు ఒక బ్యూటిఫుల్ మెమొరీ. ఎంతో పెద్ద మనసుతో మాకు సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్యూ సో మచ్. ఈ సమ్మర్లో ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమా ఇది. మాకోసం ఒక్క రెండున్నర గంటలు స్పెండ్ చేయండి. సూపర్ గా ఎంటర్టైన్ చేస్తాం. ఇది నా ప్రామిస్. మైత్రి మూవీ మేకర్స్ మా సినిమాని రిలీజ్ చేయడం మా బిగ్గెస్ట్ స్ట్రెంత్. వారిస్తున్న సపోర్టుకి మా టీం తరఫున మా టీం అందరి తరపునుంచి థాంక్యూ సో మచ్. మా సినిమా రిలీజ్ ముందే ఓటిటి శాటిలైట్ క్లోజ్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది మా కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తున్నారంటే తప్పకుండా ఇది ప్రేక్షకులు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాం. అందరికీ థాంక్యూ వెరీమచ్’అన్నారు
హీరోయిన్ దీపిక మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మా సినిమాని సపోర్ట్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్యూ. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఇంత మంచి టీం తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రదీప్, భరత్ నితిన్ లకు థాంక్యూ. నేను లీడ్ యాక్టర్ గా చేసిన ఫస్ట్ సినిమా ఇది. ఇంత మంచి క్యారెక్టర్ ప్లే చేయడం ఒక బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతున్నాను. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సమ్మర్ హాలిడేస్ లో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి వెళ్లి హాయిగా నవ్వుకోండి. అందరూ కూడా సినిమాని థియేటర్లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’అన్నారు
డైరెక్టర్ భరత్ మాట్లాడుతూ… రామ్ చరణ్ గారు మా సినిమాకి పెద్ద. చాలా సపోర్ట్ చేశారు. రామాయణంలో ఉడతని శ్రీరాములవారు ఎలా ఎలివేట్ చేశారు మా సినిమాని రామ్ చరణ్ గారు అంతలా ఎలివేట్ చేశారు. మీరంతా సినిమా చూసిన తర్వాత మా టీం గురించి మాట్లాడుతాను. సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’అన్నారు
డైరెక్టర్ నితిన్ మాట్లాడుతూ.. మా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసి ప్రమోషన్ కు గ్రాండ్ బిగినింగ్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి థాంక్యూ. ఫస్ట్ టికెట్ ని పర్చేజ్ చేసి మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి థాంక్యూ. మంచి టీం వర్క్ తో చేసిన సినిమా ఇది. బాల్ రెడ్డి గారు రధన్ గారు చాలా వాల్యూ ఆడ్ చేశారు . ఇది బ్యూటిఫుల్ జర్నీ. ప్రదీప్ అన్న థాంక్యూ. ఈ కథ చెప్పిన తర్వాత సినిమాని భుజాలపై మూసుకుని తీసుకొచ్చా.రు దీపికకి ఈ కథ కూడా చెప్పలేదు. మాపై నమ్మకంతో చేసింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టామని అనుకుంటున్నాం ఏప్రిల్ 11న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందర్నీ అలరించే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఫస్ట్ ప్రైమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సమ్మర్ లో హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ రధన్ మాట్లాడుతూ.. ప్రదీప్ గారు నన్ను ఒక బ్రదర్ లా ఫ్రెండ్ లా గొప్పగా ట్రీట్ చేశారు. ఒక అవార్డ్ ఫంక్షన్ లో మేము ఫస్ట్ టైం కలిసాము అప్పటినుంచి మా జర్నీ బ్యూటిఫుల్ గా ఉంది. ఒకరోజు ఫోన్ చేసి ఈ సినిమాకి మ్యూజిక్ చేయాలని చెప్పారు. నితిన్ భరత్ ఇలాంటి మంచి టీం తో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో చాలా హ్యాపీగా పనిచేసిన సినిమా ఇది. మ్యూజిక్ లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఇందులో పాటలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్ లో ఉంటాయి. 60 ఇయర్స్ ఓల్డ్ వాయిస్ తో సాంగ్ ని చేయడం జరిగింది. ఆ పాటని మా మామగారు పాడారు. దాన్ని నితిన్ భరత్ యాక్సెప్ట్ చేశారు. చాలా బ్యూటిఫుల్ టీం ఇది. ఈ టీంలో ఉండటమే ఒక వరంలా భావిస్తున్నాను. ఈ టీం లో ఉన్న మంచితనం స్క్రీన్ మీదకు వచ్చింది. ఆ నవ్వుని మీరు థియేటర్స్ లో చూడబోతున్నారు. తప్పకుండా ఈ సినిమాని చూసి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. సినిమా మీద ప్రేమ ఉన్న అందరికీ ఈ మూవీ సాంగ్స్ ని డెడికేట్ చేస్తున్నాను’అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ ఆశిష్ మాట్లాడుతూ.. సినిమా అంతా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమా చూసి పడి పడి నవ్వుతారు. నితిన్ భరత్ టెలివిజన్లో చాలామందికి లైఫ్ ఇచ్చారు ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించి అందరికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ విజువల్స్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఇవన్నీ చాలా పెద్ద సినిమాకి ఉన్నట్లుగానే ఉంటాయి. రధన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. దీపిక ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్. ప్రదీప్ అన్న ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసాడు. ప్రతి షోని ఎంత పాషన్ గా చేస్తాడో ఈ సినిమాని కూడా అంతే పాషన్ గా పనిచేశాడు. ప్రతి సీన్లో పడి పడి నవ్వేలా చేశాడు. అందరూ సినిమాని థియేటర్లో చూసి పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా’అన్నారు

రైటర్ సందీప్ మాట్లాడుతూ.. సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది. చాలా మంచి ఎంటర్టైనర్. ఫస్ట్ ప్రైమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మంచి కథ చెప్పాలని ప్రయత్నించాం. సినిమా అద్భుతంగా వచ్చింది తప్పకుండా అందరికీ నచ్చుతుంది . నితిన్ భరత్ టీవీలో పీక్స్ చూశారు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కి కూడా చాలా మంచి సినిమాతో వచ్చారు. ప్రదీప్ అన్నతో కలిసి ఈ సినిమాకి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’అన్నారు. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు.