Friday, October 18, 2024
HomeMovie Newsవారంలో రెండు రోజులు సినిమా షూటింగ్స్ లలో పాల్గొనాలని పవన్ ఆలోచన

వారంలో రెండు రోజులు సినిమా షూటింగ్స్ లలో పాల్గొనాలని పవన్ ఆలోచన

- Advertisement -

ఏపీ సాధారణ ఎన్నికలలో కూటమి తిరుగులేని విజయం సాధించడంతో ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా స్వీకరించడంతో పొలిటికల్ హడావిడి కాస్త తగ్గింది. ఇప్పుడు అందరి దృష్టి ఆయన సినిమాలపైనే ఉంది. ఇకపై రాజకీయాలలో బిజీ కాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంతవరకు టైం కేటాయించగలరు? అన్నదే మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అందరి దృష్టిలో మెదులుతున్న ప్రశ్న. అయితే పవన్ కళ్యాణ్ తనకోసం ఇన్ని నెలలు వెయిట్ చేసిన డైరెక్టర్స్ కి షాక్ ఇచ్చేలా ఓ నిర్ణయం తీసుకున్నారనే వార్త తాజాగా బయటకు వచ్చింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం క్రిష్, సుజిత్, హరిష్ శంకర్ లాంటి యంగ్ డైరెక్టర్స్ క్యూలో ఉన్నారు. ఇక ఆయన లైనప్ లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి లాంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే వీటిలో హరిహర వీరమల్లు, ఓజి సినిమాలకు సంబంధించిన షూటింగ్ కొంత వరకు పూర్తి చేశారు. పాలిటిక్స్ కోసం పవన్ బ్రేక్ ఇవ్వడంతో ఆయన ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడా అని ఈ డైరెక్టర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఒక అనడమే ఆలస్యం షూట్ మొదలు పెడతాం అన్నట్టుగా ఉన్నారు. అయితే ఈ మూడు సినిమాలకు సంబంధించిన చిత్రీకరణను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కేవలం వారంలో రెండు రోజులు మాత్రమే డేట్స్ ను కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజులు సినిమాలకి, వారంలో మిగతా రోజులు ప్రజలకి అందుబాటులో ఉంటారట. మరి ఇన్నేళ్ళు వెయిట్ చేసిన తమ కోసం వారంలో కేవలం రెండు రోజులే టైం ఇస్తే అసలు షూటింగ్స్ ఎప్పుడు పూర్తి అవుతాయి? అంటూ ఆయన డైరెక్టర్, నిర్మాతలు టెన్షన్ పడుతున్నారట. మరి పవన్ ఏంచేస్థాడో చూడాలి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read