Movie News

పవన్ – రవితేజ కలయికలో సినిమా వస్తే ..రికార్డ్స్ బ్రేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రవితేజ కలయికలో ఓ సినిమా మిస్ అయినట్లు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం వీరి కలయికలో సినిమా చేయాలనీ భావించారు. దర్శకుడు మణిరత్నం తన కెరీర్‌లో ఎన్నో మల్టీస్టారర్ మూవీలు చేశాడు. వాటిల్లో ఒకటి ‘యువ’. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలో సూర్య, మాధవన్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందించగా.. హిందీలో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, వివేక్ ఒబెరాయ్ కాంబోలో తెరకెక్కింది.

అలాగే దీన్ని తెలుగులో మొదట పవన్ కళ్యాణ్, రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించాలని దర్శకుడు అనుకున్నాడట. కానీ చివరి నిమిషంలో అది వర్కౌట్ కాలేదట. తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలతో ఈ సినిమాతీస్తే కష్టమవుతుందేమో, ఆడదేమో అన్నారంట. మీరు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందకపోతే సినిమా తీయొద్దు.. వేరే కథతో సినిమా తీద్దామని మణిరత్నం అన్నారు.

ఆ తర్వాత ఏ కథతోను సినిమా తెరకెక్కలేదు. యువ సినిమా తెలుగులో అటకెక్కింది. తర్వాత అదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతోనే సూర్య తెలుగు ప్రేక్షకులకు మొదటిసారిగా పరిచయం అయ్యాడు. సినిమా మొత్తం స్లో నెరేషన్ లో సాగుతుందని, మణిరత్నం-పవన్ కల్యాణ్ అంటే అంచనాలు భారీస్థాయిలో ఉంటాయని, అంత స్లో నెరేషన్ వీరికి పనికివచ్చేదికాదని, కచ్చితంగా సినిమా ఫ్లాప్ అయ్యేదని, పవన్ కల్యాణ్ చెప్పిందే సరైందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.