Movie News

పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తీసుకొని సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చేసేంది తక్కువ సినిమాలే కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉండడం ఆయనకే సొంతం. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు. వరుసగా ఏడు హిట్ సినిమాలు చేసిన తర్వాత ఒక 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ కి హిట్ సినిమా లేకపోయినా కూడా ఆదరణ తగ్గలేదు కానీ పెరిగింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం పవన్ ఒక్క సినిమాకు 40 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా..ఆయన కెరియర్ లో అసలు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేయడం జరిగింది. అది ఏ సినిమా తెలుసా..? తొలిప్రేమ.

కరుణాకర్ దర్శకుడుగా పరిచయమైన తొలిప్రేమ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమాకు సంబంధించి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ బడ్జెట్ అవ్వడం వలన పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తీసుకోలేదట. అనూహ్యంగా సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మంచి లాభాలు వచ్చాయి. ఆ తర్వాత నిర్మాత పవన్ కళ్యాణ్ కి డబ్బులు ఇచ్చినట్టు ఒక ఇంటర్వ్యూలో నిర్మాత చెప్పుకొచ్చాడు. అలానే పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని అన్ స్టాపబుల్ అనే రియాల్టీ షోలో చెప్పాడు.