Friday, October 18, 2024
HomeMovie NewsOG లో పవన్ పేరు ఏంటో తెలుసా..?

OG లో పవన్ పేరు ఏంటో తెలుసా..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ౦ సుజిత్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ OG . ఈ మూవీ ఏ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు..జస్ట్ టీజర్ తోనే పలు రికార్డ్స్ బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ‘ఓజాస్ గంభీర’ అని దర్శకుడు సుజీత్ వెల్లడించారు. కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’ ప్రమోషన్స్లో భాగంగా OG సినిమా విశేషాల్ని పంచుకున్నారు. మొదట పవన్ తనను రీమేక్ కోసం పిలిచారని, తర్వాత కొత్త కథ ఏదైనా ఉందా? అని అడిగితే OG స్టోరీ చెప్పానని తెలిపారు. అది ఆయనకు నచ్చడంతో సినిమా పట్టాలెక్కిందని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏపీ ఎన్నికల కారణంగా చేతిలో ఉన్న మూడు సినిమాలు గత కొన్నాళ్లుగా పక్కన పెట్టారు. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఆ సినిమాల షూటింగ్స్ పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు. వీటిలో ముందు OG సినిమానే వస్తుంది. ఆల్రెడీ సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ తో OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ ఒక 20 రోజులు షూటింగ్ కి డేట్స్ ఇస్తే OG సినిమా మొత్తం పూర్తవుతుంది. ఎన్నికల రిజల్ట్స్ తర్వాత పవన్ OG సినిమాకు డేట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్‌స్టర్ గా నటిస్తున్నాడు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read