సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పోలీసుల గాలింపులో ఉన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో పెట్టిన మార్ఫింగ్ ఫోటోలు, అనుచిత వ్యాఖ్యలతో వర్మపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల పరిష్కారం కోసం పోలీసులు వర్మను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా, ఆయన పోలీసుల ముందు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో ఆయనకోసం ఏపీ పోలీసులు హైదరాబాద్ తో పలు రాష్ట్రాల్లో గాలింపు చేస్తున్నారు.
ఒంగోలు పోలీసులు వర్మను విచారణకు హాజరుకావాలని రెండు సార్లు నోటీసులు పంపారు. అయితే వర్మ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు, కానీ విచారణ రేపటికి వాయిదా పడింది. వర్మ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నప్పటికీ, తన ట్విట్టర్ ఖాతా యాక్టివ్ గా ఉంది. ఆయన కోయంబత్తూరులో షూటింగ్ లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోలను హైడింగ్ లో నుండే షేర్ చేశారు. వర్మకు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చే వరకు ఆయన బయటకు రావడం కష్టం అనిపిస్తుంది.