Tuesday, December 24, 2024
HomeMovie News' OG ' నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది..

‘ OG ‘ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది..

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఓజి (OG) . ఈ పాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ చిత్రాన్ని సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన తొలి గీతాన్ని 2024 జనవరి 1న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సాంగ్ విడుదల కావాల్సి ఉండగా, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని వరదల కారణంగా వాయిదా పడింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, తమిళ స్టార్ శింబు ఈ చిత్రంలోని ఓ పాట పాడడం విశేషం. ఈ సినిమాను 2025 వేసవి లో విడుదల చేయాలనీ చూస్తున్నారు. పవన్ ఈ సినిమాతో పాటు హరి హర వీరమల్లు చేస్తున్నాడు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read