Movie News

‘OG’ నుంచి స్పెషల్ వీడియో..ఫ్యాన్స్ కు పూనకాలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజిత్ కలయికలో OG మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఫేమ్ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఫై అంచనాలు తారాస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి కావాల్సి ఉండగా..పవన్ పాలిటిక్స్ లో బిజీ గా ఉండడం తో షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటె పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నాడు OG టీం సరికొత్త వీడియో ను రిలీజ్ చేయబోతున్నారట.

పవన్ పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ ఓ పండగలా జరుపుకుంటారు. కేకులు కట్ చేయడం, రక్తదానం, అన్నదానం చేస్తుంటారు. అలాగే నిరుపేదలకు వస్త్రదానం కూడా చేస్తారు. అయితే ఆయన పుట్టిన రోజున సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ను కోరుకుంటారు. గతేడాది పవన్ పుట్టినరోజు( సెప్టెంబరు 2)న ‘OG’ నుంచి ‘హంగ్రీ చీతా’ అంటూ ఓ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ గ్లింప్స్ ఫ్యాన్స్​కు పునకాలు తెప్పించింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడం వల్ల షూటింగ్​కు బ్రేక్ పడి సినిమా నుంచి అప్డేట్స్ రాలేదు. అలాగే ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ బర్త్ డేకి డైరెక్టర్ సుజీత్ ఓ పవర్ ప్యాక్ వీడియోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను తీర్చిదిద్దే పనిలో సుజీత్ ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోను పవర్ స్టార్ అభిమానులను నచ్చుతుందని, పూనకాలు తెప్పిస్తుందని అంచనా వేస్తున్నారు.