Movie News

భారీ ధరకు ‘ఓజీ’ ఓటీటీ రైట్స్..

పవర్ స్టార్ పవన్​కల్యాణ్​ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ప్రభాస్ సాహో ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు. డీవీవీ ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్ నిర్మిస్తోంది. పక్కా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా రాబోతుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పవర్​ఫుల్​ గ్యాంగ్​స్టర్​ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా 75 శాతం పూర్తైంది. సెప్టెంబర్ 27 న గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.92 కోట్లకి కొనుగోలు చేసినట్లుగా టాక్ నడుస్తుంది.

ఇదే నిజమైతే పవన్ సినిమాల్లో ఇదే అత్యధికం కావచ్చు. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్‌కి నెట్‌ఫ్లిక్స్ 2025 స్లాట్‌ను కేటాయించిందట. దీన్ని బట్టి ఓజీ థియేట్రికల్ రిలీజ్ వాయిదా పడినట్లేనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో థియేటర్లో సినిమా రిలీజైన నెలన్నర లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. సో ఓజీ సెప్టెంబర్‌ 2024లో థియేటర్లలో రిలీజైతే ఏడాది వరకూ ఓటీటీ రిలీజ్ కోసం ఎందుకు ఎదురుచూస్తుందనేదే ప్రశ్న. కాబట్టి ఓజీ వాయిదా పడే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఓజీలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.