కుంచాకో బోబన్ నటించిన మలయాళ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఫిబ్రవరి 20న విడుదలై మంచి అద్భుతమైన రివ్యూస్ తో బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ప్రియా మణి కథానాయికగా నటించగా, జగదీష్, విశాక్ నాయర్ కీలక పాత్రలు పోషించారు. జితు అష్రఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్టిన్ ప్రక్కట్, రెంజిత్ నాయర్, సిబి చావర నిర్మించారు. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. E4 ఎంటర్‌టైన్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ హక్కులను సొంతం చేసుకోగా, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మార్చి 7న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ రోజు మేకర్స్ తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఓ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా హరిశంకర్ అనే పోలీసు అధికారి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఆయన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలేంటి? ఒక చిన్న నేరాన్ని దర్యాప్తు చేస్తూ ఆర్గనైజ్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైకో కిల్లర్స్ ని ఎలా వెలికితీస్తాడనే ఎలిమెంట్స్ ని చాలా ఎక్సయింటింగ్ ప్రజెంట్ చేశారు
బ్రెత్ టేకింగ్ యాక్షన్ సన్నివేశాలు, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ లు, ఎంగేజింగ్ నెరేటివ్ తో ట్రైలర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాబీ వర్గీస్ రాజ్ కెమరా వర్క్ థ్రిల్ ని మరింత ఎలివేట్ చేసింది.
మలయాళంలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ తెలుగులో స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని చూపనుందని ట్రైలర్ హామీ ఇస్తోంది.