Movie News

‘ఓదెల 2’ సినిమా కూడా జీవితంలో ఒకేసారి వచ్చే గొప్ప అదృష్టం – తమన్నా

చీకటి, కాంతి యొక్క పురాతన శక్తులు ఢీకొనే ప్రపంచం నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ టీజర్, సూపర్ నేచురల్ రోలర్‌కోస్టర్ రైడ్‌ గా అద్భుతమైన కథనాన్ని ప్రజెంట్ చేసింది. ఈ సినిమా ప్రధాన సంఘర్షణ ఒక రాక్షస శక్తి తిరిగి రావడం నుండి పుడుతుంది, దాని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని, ప్రపంచాన్ని అల్లోకల్లోలం చేయాలని చేయాలని నిశ్చయించుకుంది.

నాగ సాధువు పాత్రను తమన్నా పోషించిన తీరు అద్భుతమైనది. దైవిక శక్తి, ఉగ్రమైన సంకల్పం రెండింటినీ ప్రసరింపజేస్తూ, ఆమె ప్రజెన్స్ మంత్రముగ్ధులను చేస్తుంది. విలన్ గా వశిష్ట ఎన్ సింహ లుక్ టెర్రిఫిక్ గా వుంది. టీజర్ కథనంలో కీలక పాత్రధారులను కూడా పరిచయం చేస్తుంది, వీరిలో హెబ్బా పటేల్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలు ఆసక్తికరంగా వున్నాయి.

అశోక్ తేజ నైపుణ్యం కలిగిన దర్శకత్వం, సంపత్ నంది పర్యవేక్షణలో, ఓదెల 2 ఒక గొప్ప సినిమాటిక్ విజన్‌గా అలరించబోతోంది. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కథలో లీనమయ్యే అనుభవాన్ని కలిగించాయి. అజనీష్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్ ఇంటన్సిటీని మరింత పెంచింది.  మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్  నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. మహాకుంభమేళా జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఓదెల 2 సినిమా కూడా జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. నిర్మాత మధు గారికి థాంక్ యూ. ఈ సినిమాతో పుణ్యం, డబ్బు రెండు కలిసి వస్తాయని భావిస్తున్నాను.  మహాకుంభమేళాలో ఈవెంట్ ఇంత గ్రాండ్ గా చేయడం మామూలు విషయం కాదు. సంపత్ గారి విజన్ ని డైరెక్టర్ అశోక్ గారు అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు.

ఈ సినిమా లాంచ్ అయినప్పటిని నుంచి ఎదో మ్యాజిక్ ఫీల్ అయ్యాం. సంపత్ గారితో నాలుగు సినిమాకు చేశాను. కానీ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా వుంటుంది. అజినీష్ మ్యూజిక్ ఈ సినిమాకి సోల్. వశిష్ట పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నా కెరీర్ లో ఇలాంటి టీజర్ లాంచ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్.

మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. ప్రేక్షకులు, భక్తులు ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చుస్తున్నారు. ఈ విషయంలో మా నిర్మాత మధు గారికి థాంక్ యూ. పరమ శివుని ఆశీస్సులు కోసం ఇక్కడి వచ్చాం. ఈ సినిమా ఆలోచన అవకాశం ఆ దేవుడు ఇచ్చినదే అని నమ్ముతున్నాను. సినిమాని కాశీలో లాంచ్ చేయడం, టీజర్ ని కుంభమేళాలో లాంచ్ చేయడం.. ఇదంతా ఆ శివుని దీవెన గా భావిస్తున్నాను.