తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు, సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్ గా మల్టిపుల్ రోల్స్ లో వర్క్ చేశారు.అలాగే డైరెక్షన్ సూపర్ విజన్ ని అందిస్తున్నారు. అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై డి. మధు నిర్మిస్తున్నారు. టీజర్, మిగతా ప్రమోషనల్ కంటెంట్ కి ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు, ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ ట్రైలర్ పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమవుతుంది, ఇది ఓదెల గ్రామంపై పొంచి ఉన్న ముప్పుకు సూచిస్తోంది. ఇది ఒక దుష్ట శక్తి గురించి చెబుతుంది. విధ్వంసక శక్తిని విడుదల చేయడానికి సరైన క్షణం కోసం వేచి ఉంది. చెడు శకునాలు కనిపించడం ప్రారంభించగానే, గ్రామస్తులు భయంతో మునిగిపోతారు, చీకటి నెమ్మదిగా తమ జీవితాలను ఆవరిస్తోందని గ్రహిస్తారు. పెరుగుతున్న ఈ భయం మధ్యలో ఒక నాగ సాధువు వస్తోంది. అచంచలమైన దృఢ సంకల్పంతో ఆమె చెడును ఎదుర్కోవాలని ప్రతిజ్ఞ చేస్తుంది, మంచి, చెడు శక్తుల మధ్య ఒక ఎపిక్ వార్ ని ప్రామిస్ చేస్తోంది.
మేకర్స్ బిగ్ స్టొరీ ని బిగ్ స్కేల్ లో ప్రజెంట్ చేశారు. సంపత్ నంది రైటింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది, అశోక్ తేజ బిగ్ కాన్వాస్ పై అద్భుతంగా ప్రజెంట్ చేశారు. కథాంశాన్ని రివిల్ చేయడంతో పాటు, ట్రైలర్ ప్రధాన పాత్రలను కూడా పరిచయం చేస్తుంది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత వుంది.
నాగ సాధువుగా తమన్నా భాటియా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. క్యారెక్టర్ కు సహజత్వం, ఇంటన్సిటీని తీసుకొచ్చింది. మరోవైపు, వశిష్ట ఎన్ సింహ పాత్ర దుష్ట శక్తిగా భయాన్ని కలిగిస్తుంది, ప్రతి సన్నివేశంలో తన ప్రజెన్స్ టెర్రిఫిక్ గా వుంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆర్ట్ రాజీవ్ నాయర్ ప్రతి సెట్ ని అద్భుతంగా మలచి విజువల్ ఎక్స్ పీరియన్స్ ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ఎస్ అద్భుతమైన విజువల్స్‌తో సినిమా కోసం నిర్మించిన ప్రపంచాన్ని అద్భుతంగా చూపించారు. బి అజనీష్ లోక్‌నాథ్ ఎక్సయిటింగ్ స్కోర్ ప్రతి సన్నివేశంకు ప్రాణం పోసింది. VFX వర్క్ అత్యున్నతంగా వుంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సినిమా మొత్తం ఇంపాక్ట్ ని పెంచు వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని నిర్మించారు. ఈ అద్భుతమైన ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చే ఈ విజువల్ వండర్ ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది.