Movie News

ఆగస్ట్ 9న ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ పూజా కార్యక్రమాలు

KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో ఓ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ తాలూకా సరికొత్త అప్డేట్ వచ్చేసింది. మొన్నటి వరకు ఎన్టీఆర్ దేవర, ప్రశాంత్ సలార్ 2 తో బిజీ గా ఉండడం వల్ల ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు ఫ్రీ అవ్వడం తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఆగస్ట్ 9న ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిపేందుకు సిద్ధమయ్యారని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రీ కూడా సపరేట్‌గా ఓ కొత్త ఆఫీస్‌ను ప్రారంభిస్తుందట. మరి వీటిపై మైత్రీ అధికారికంగా స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

ఇదిలా ఉంటె ఎన్టీఆర్ దేవర పాట నెట్టింట్లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. చుట్టమల్లే అంటూ సాగే ఈ పాట మీద ఓ వైపు ట్రోలింగ్ ఏర్పడుతుంది.. ఇంకో వైపు ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు. దేవర రెండో పాటను మాత్రం ఇప్పుడు రకరకాలుగా ట్రోలింగ్స్, మీమ్స్‌తో వైరల్ చేస్తున్నారు. దేవర పాటను.. సోప్ యాడ్‌లా ట్రోలింగ్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ అందాలు, ఎన్టీఆర్ లుక్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. కాకపోతే అనిరుధ్ ఇచ్చిన బాణీ మీద మాత్రం ట్రోలింగ్ జరుగుతోంది.